అన్నదమ్ముల కథlorg cEi iBm Y0l Px Yiepikt
అన్నదమ్ముల కథ 1975 జూన్ 19వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.
| అన్నదమ్ముల కథ (1975 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | డి.ఎస్.ప్రకాశరావు |
|---|---|
| తారాగణం | బాలయ్య , ప్రభ, సత్యేంద్ర కుమార్, రోజారమణి |
| సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | అమృతా ఫిలిమ్స్ |
| భాష | తెలుగు |
విషయ సూచిక
- 1 సాంకేతిక వర్గం
- 2 నటీనటులు
- 3 సంక్షిప్త చిత్రకథ
- 4 పాటలు
- 5 మూలాలు
సాంకేతిక వర్గం[మార్చు]
- కథ: ఎం.బాలయ్య
- మాటలు :సముద్రాల జూనియర్
- పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- ఛాయాగ్రహణం: బి.రామచంద్రయ్య
- కూర్పు: వీరప్ప
- కళ: కె.నాగేశ్వరరావు
- నిర్మాతలు: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకటరావు
- దర్శకుడు: డి.ఎస్.ప్రకాశరావు
నటీనటులు[మార్చు]
- ఎం.బాలయ్య - సత్యం
- సత్యేంద్ర కుమార్ - రమణ
- ప్రభ - జానకి
- సుజాత - జయ
- రోజారమణి - పార్వతి
- పండరీబాయి
- మిక్కిలినేని
- రావు గోపాలరావు
- రావి కొండలరావు
- చంద్రమోహన్
- సాక్షి రంగారావు
- వైజయంతి
- సరోజ
సంక్షిప్త చిత్రకథ[మార్చు]
సత్యం, రమణ అన్నదమ్ములు. సత్యం నిజాయితీగా, న్యాయంగా బ్రతికే ఇంజనీరు. పేదవాళ్లయిన తమకు అండగా నిలిచిన మేనమామ కూతురును పెళ్ళి చేసుకున్నాడు. రమణ స్వభావం అన్న స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఏ విధంగానైనా డబ్బు సంపాదించడం అతని ధ్యేయం. ఒక అవినీతిపరుడైన కాంట్రాక్టరు వద్ద చేరి, కేవలం డబ్బు కోసమే అతని అవిటి కూతురును పెళ్ళాడి, అక్రమ పద్ధతులలో అతని కంపెనీకి మేనేజర్ అవుతాడు. మారుతల్లి కూతురైన చెల్లెలి కోసం అన్న పాటు పడితే, ఆమె స్వంత అన్న అయిన రమణ ఆమె కష్టాలకు కారకుడౌతాడు. అన్నపై అవినీతి ఆరోపణలు మోపి అన్నను, తల్లిని, మేనమామను కడగండ్ల పాలు చేస్తాడు. ఇలా ధర్మాధర్మాలకు ప్రతీకలైన అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటంలో ఒక కుటుంబం కష్టాల పాలవుతుంది. చివరకు ధర్మం గెలుస్తుంది. నీతి జయిస్తుంది. అవినీతి అనర్థాలకు హేతువని రుజువవుతుంది[1][2].
పాటలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ రెంటాల (22 June 1975). "రూపవాణి - అన్నదమ్ముల కథ చిత్ర సమీక్ష". ఆంధ్రపభ దినపత్రిక. Retrieved 14 August 2019.
- ↑ వెంకట్రావ్ (22 June 1975). "చిత్రసమీక్ష అన్నదమ్ముల కథ". ఆంధ్ర పత్రిక దినపత్రిక. Retrieved 14 August 2019.